శర్మ కాలక్షేపంకబుర్లు- శుభకామనలు.

స్వాగతం

DSCN0853

(పెరటిలోని బటన్ చామంతి)

ఆశ

ఆంగ్ల నూతన సంవత్సరాది శుభకామనలు.

మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది
పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పోదాం పై పైకి
మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది

పతితులార భ్రష్టులార బాధా సర్ప దష్టులార
దగా పడిన తమ్ములార ఎడవకండేడవకండి
జగన్నాధ రధ చక్రాలొస్తున్నాయ్ వస్తున్నాయ్
రధ చక్ర ప్రళయ ఘోష పట్టిస్తాను
భూకంపం పుట్టిస్తాను

నేను
ముసలివాణ్ణి
కాను అసలు వాణ్ణి
పడగెత్తిన తాచుపాము బుసలవాణ్ణి
పీడితుల్ని వెంటేసుకు మసలువాణ్ణి
అందుకున్న ఆకాశపు కొసల వాణ్ణి

శ్రీశ్రీ

”ఏంటీ? కొత్త సంవత్సరం పొద్దుటే ఎవరినీ ఏడవకండేడవకండేడవకండి ని ముమ్మారు చెప్పేస్తున్నారు?” అని లేపింది ఇల్లాలు, కళ్ళు నులుపుకుంటూ లేస్తూనే
“శుభోదయం! కొత్త సంవత్సరం లో పొద్దుటే నీ మొహమే చూశానోయ్!” అంటే
“ఆ( రోజూ చూస్తూనే వున్నారు, ఏభైయేళ్ళ పైగా, మాట మార్చేశారు,మీ బుద్ధే అంత, ఏంటి అంటున్నారు అది చెప్పండి” అని నిలదీసింది.
’కల’ అన్నా.
“ఓస్! అదెప్పుడూ కలే ! దర్పణ దృశ్యమాన నగరీ” అని సాగదీసింది.
“ఏమోయ్! అద్దంలో కనపడే నగరం మిధ్య అయితే, అసలు లేనిది, అద్దంలో మాత్రం ఎలా కనపడుతుందోయ్” అనుమానం వ్యక్తం చేసా.
“అదా! శంకరులు చెప్పిన మాయ, రజ్జు సర్ప భ్రాంతి, అదే! అన్నట్టు మీకు జీవితమంటే తెలుసా?” అని ప్రశ్నించింది.
“చెప్పు! చెప్పూ!!” అని చెయ్యిపట్టుకుని పక్కన కూచోబెట్టుకోడానికి ప్రయత్నం చేశా!
“ఆశ,దోశ, అప్పడం,వడ పొద్దుటే మీ దగ్గర కూచుని కబుర్లాడితే నాకు పనెలా అవుతుందీ!” అంటూ చెయ్యి వదిలించుకుని పారిపోయిందండీ, అసలింతకీ ఆవిడ జీవితమంటే ఏంటో చెప్పిందంటారా? …
ఆంగ్ల నూతన సంవత్సరాది శుభకామనలు.

సర్వే జనాః సుఖినోభవంతు

19 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు- శుభకామనలు.

 1. ఆశ దోశయ్యె నప్పడా లయ్యె వడలు
  ఇంత విస్పష్టముగ జెప్పె , సుంత యైన
  తెలియ లేదేమి శర్మకు తెలుగు రాద
  తెలిసి – తెలియని యట్లు నందింతు రేల .

  మెచ్చుకోండి

 2. బండి రావు గారు,

  సందేహము వలుదు వలదు జిలేబివదన గా మీ సందియము తీర్చేదన్ 🙂

  నెనరు అడిగె జే నెనా నేమియో
  కె ననగ జెపుడూ; కె మావారుమా
  కనగ అవరె జే కథాగామినా
  భి నగముదిత మా బిలేజీ గురూ

  చీర్స్
  జిలేబి

  మెచ్చుకోండి

 3. మీకూ , మీ కుటుంబ సభ్యులందరికీ ,
  నూతన సంవత్సర శుభాకాంక్షలు !
  మీరు నూతనోత్తేజం తో , ఇలాగే టపాలు వేస్తూ ,
  ” యువతరానికి ” స్ఫూర్తి అవుతారని ఆశిస్తున్నా !!

  మెచ్చుకోండి

 4. నూతన సంవత్సర శుభాకాంక్షల్ !

  దర్పణంలో నగరం ఉందా నగరంలో దర్పణం – ఉందా ? జేకే !

  ఇందులో అది ఉంటె, అది దేనిలో ఉంది ? ఇందులో అది, అందులో ఇది లేకుంటే అదీ ఇదీ ఉందా లేదా ? మరో జేకే !

  శుభోదయం !
  జిలేబి

  మెచ్చుకోండి

వ్యాఖ్యలను మూసివేసారు.