శర్మ కాలక్షేపంకబుర్లు-నన్ను జైల్లో పెట్టండి బాబోయ్!

నన్ను జెయిల్లో వేసేయండి బాబోయ్!

జైల్లో వేసెయ్యండటూ పెద్దగా అరుచుకుంటూ లోపలికి పరిగెట్టుకొచ్చాడో ముఫ్ఫై ఏళ్ళ యువకుడో ఉదయమే, ఒక పట్టణపు పోలీస్ స్టేషన్ లోకి.

రాత్రి మత్తు అదే నిద్రమత్తే 🙂 వదలని ఎసై గారు బద్ధకంగా నోరావలిస్తూ

”ఏం జేసేవు? ఎవణ్ణేనా చంపేవా? చచ్చేలా పొడిచావా?, చితక బాదేవా?, ఏ గుడి మీదేనా బాంబేసేవా?” అన్నట్టు వచ్చినవాడి కేసి చూస్తూ ఆరాతీశాడు, చేతుల్లో సాక్ష్యానికి తగినవేవీ కనపడక నిరుత్సాహపడ్డాడు.

”మా ఆవిణ్ణి చితకా మతకా, చింతకాయ పచ్చడి చేసినట్టు చితక్కొట్టేసేను, నన్ను లోపలేసేయండ”ని మళ్ళీ గోల పెట్టేడు యువకుడు, భయం భయంగా వెనక్కి చూస్తూ!

ఛస్! పొద్దుగాల ఇసుమంటి నూసెన్స్ కేసొచ్చినాదనుకుంటా, ”ఓస్! మొగుడూ పెల్లాల యవ్వారమా” అనేసి, సాల్లే పొద్దుగాలా అనుకుంటూ కాళ్ళు బారజాపేడు, ఎదురుగా ఉన్న డ్రాయరు మీకి.

ఇది చూసిన యువకుడికి మతిపోయింది. ఏంటీ ఎసై, పెళ్ళాన్ని చితకా మతకా చింతకాయ పచ్చడి చేసినట్టు మడతేసేనురా మగడా అని మొత్తుకుంటుంటే మాటాడ్డు, లోపలెయ్యమంటే కునుకుతున్నాడనుకుని కూచున్నాడు, ఎదుటి బల్ల మీద. ఓరకంటితో చూసిన ఎస్.ఐ ఛస్! ఈడేటీ! జిగట ఇరేచనం లా వదిలాలేడు, ఇదేటి ఉపయోగపడీ కేస్ కాదనుకునేటప్పటికి, ఓ గొప్ప ఆలోచనొచ్చీసింది. ఆ! అదగదీ అనుకుంటా, ఎ.సి.పి దొరకి ఫోన్ కలిపీసి సార్! ఇక్కడో గుంటడు పెల్లాన్ని ఉతికీసినాని తెగ్గోల జేస్తన్నాడు, తవరుగారు, పెద్దపెద్ద కేసుల్నే అలగ్గా జూసినోరు, ఇసుమంటి కేసులెన్నో చూసినోరు, పెద్దోరు, తవరే డీల్ సెయ్యాల ఈ కేస్, గుంటణ్ణి తవరిగారి సేంబర్ కాడ కూకోబెడతా అని ఎక్కించేసేడు. కుర్రోడికి చెప్పేసేడు. మేడ మీన దొరగారి రూం కాడ కూకోమని. యువకుడికీ ఆశ పుట్టుకొచ్చింది. మేడ మీదకి పోయి ఎ.సి.పి దొర రూం దగ్గర బైఠాయించాడు.

ఎ.సి.పి దొరొచ్చీ లోపులో ఒకాడకూతురో కాగితం ముచ్చుకోని స్టేషన్లోకడుగెట్టింది. ”దేశమెటుపోతాందయ్యా! మీరేటి సేత్తన్నారు, ఆడ కూతుళ్ళకి రచ్చన లేదా! ఇంట్లోనూ ఈదిలోనూ బతకనియ్యరా? మమ్మల్ని సంపీసినా, సితక బొడిసీసినా కానుకునీ ఓడే లేదా! ఏం జేత్తన్నారయ్యా! ఏడీ మీ దొరేడీ? ఏటి నువ్వేటి సేత్తన్నావు? నిద్దరోతన్నారయ్యా! ఏదీ సిఎంకి గలుపు, దొరక్కపోతే పి.ఎం ని గలుపు మాటాడ్తా! ట్విట్టర్లో ఎట్టేద్దామనుకున్నాగాని, మీకీ సేన్స్ ఇవ్వాలనొచ్చినా! ఏటింకా కునుకుతున్నావు? ఎక్కడ కురిసీ? ఏటిదేనా ఆడ కూతుల్లకిచ్చే మరేదా?” అని ఝణ ఝణలాదించేసింది.

జడుసుకుని, కొద్దిగా తెప్పరిల్లిన ఎస్. ఐ ”ఎవుడాడు తల్లీ! ఏటి జేసినాడు నిన్నూ!” అని అడిగి చేతులో కాయితం ముక్కుచ్చుకుని చదువుకుని, ”అమ్మా! ఫోటో ఏటేనా ఉన్నాదా? ఈ పిల్లగోడిద”నడిగితే ఓ ఫోటో చేతులో ఎట్టింది. ఈ లోగా పెద్ద దొరరావడం, మేడ మీదకెళ్ళిపోటం జరిగిపోయాయి. ”ఈ గుంటణ్ణి ఇంతకుముందే స్టేసన్ కి ఒట్టుకొచ్చినాం తల్లీ! మరో కేస్ మీన, సితకబొడిసీనా? లోపలేస్తాన్ తల్లి,తల్లి. పెద్ద దొరకాడికి పెసల్ ట్రీట్మెంట్ కి పమ్మించా!” అన్జెప్పి ఉగ్ర కాళికని ఇంటికి పంపేడు.

పొద్దుగాల నూసెన్స్ కేస్, అమెరికా మీదిరుసుకుబడ్డ తుఫాన్ ఎలిసినట్టు ఎలిసేసరికి, మేడ మీదనుంచి ఎ.సి.పి దొర ఆక్రందనలినపడ్డాయి. ”ఇదేటీ ఇంత! పొలీస్ టేసనిలో బయటోళ్ళ కేకలినపడాల గాని దొర కేకలేటని” మేనమీకి లగెత్తు కెల్లిన ఎస్.ఐ కి బొటబొటా ముక్కునించి రక్తంగారుతున్న దొర గనపడ్డాడు. ”ఏటయినాది దొరా?” అనడిగిన ఎస్.ఐ కి దొర జెప్పిన మాట.

”ఓర్నీయవ్వ! ఈడెవడ్రా!! పెల్లాన్ని మడతేసేనంటే ఒరే తమ్ముడూ పెల్లామంటే ఎవరు? దేవత! పువ్వుల్లో ఎట్టుకుని పూజ్జెయ్యాల అని చెబుతున్నా! ఇలా ముక్కుమీదో గుద్దు గుద్దేడని” లబలబలాడేడు, ముక్కునుంచి వరదలా కారుతున్న రక్తం తుడుచుకుంటూ.

అప్పుడు ఎస్.ఐ ”ఒరే ఫోర్ ట్వంటీ దొరని ఆస్పాటలికి తోలుకెల్లు జీప్ మీన” అన్జెప్పి యువకుణ్ణి పట్టుకుని లాకప్ లో ఏసి కూసున్నాడు. ఏటీడు, లాకప్పులో ఏసియ్యండో అంటన్నాడు, ఎందుకెయ్యాలా ఆరాదీబోతే పెద్దదొరకే సితకబొడిసినాడు, అని ఆలోచిస్తుంటే, ఇంతలో ఇనపడింది లాకప్పు లోంచీ పాట.

”కలనిజమాయెగా కోరిక తీరెగా సాటిలేని రీతిగా మదినెంతో హాయిగా” అని. ఇప్పుడు కుర్చీలో కూచుని పాట విన్న ఎస్.ఐ హటాత్తుగా లేచి యురేకా అని అరిచి కింద పడ్డాడు.

ఎస్.ఐ యురేకా అని ఎందుకరిచాడు. జ్ఞానోదయమైనదేమి?

(రాజస్థాన్ లో జైపూర్ లో జరిగిన సంఘటన.)

ప్రకటనలు

27 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-నన్ను జైల్లో పెట్టండి బాబోయ్!

 1. ఏమోనండీ యేదో సూక్షి పెట్టి చెబ్తున్నారు 🙂

  ఈ మధ్య కాలంలో మీ టపాలే కావు వ్యాఖ్యలు కూడా అర్థం గావట్లేస్మీ 🙂

  జిలేబి

  మెచ్చుకోండి

 2. ణిసిధాత్వర్థము లెఱిగిన
  రసిక శిఖామణులు గాన రసనాగ్రమునన్
  కసిగా కందపు గుళికలు
  విస విస వెలయింత్రు బుధులు వింతలు వింతల్ .

  మెచ్చుకోండి

 3. జాణకద జిలేబమ్మా!
  తా ణిసిధాత్వర్థముల,సుతారము గానన్
  వాణిజ్య విషయములను, పు
  రాణపు రుషునికథలన్ సరళముగ గూర్చున్ !

  జిలేబి

  మెచ్చుకోండి

 4. ఫణీన్ద్ర పురాణపణ్డ గారు,

  పెద్ద పోల్తి పెట్టేసినారు బాబు 🙂

  కత సరిగా చెప్పలేకపోయాననిపించిందండి, సూచనగానైనా !

  భార్య భర్తని మడతేసింది. ఇది భరించలేక పోలీస్ దగ్గరకి పరుగెట్టేడు. కాని సంగతి చెప్పుకుంటే పరువు పోతుందని భార్యని మడతేసేనని చెప్పుకున్నాడు. అలా చెబితే లోపలేస్తారనుకున్నాడు. పోలీస్ లేమో కౌన్సిలింగ్ మొదలెట్టేరు. మళ్ళీ ఇంటికెళ్తే పెళ్ళాం మళ్ళీ తంతుంది, తప్పించుకోడానికి దారిగా, ఎ.సి.పి ని ఒక్కటి పీకేడు.

  భర్త తన్నినా ఇంటి దగ్గరే పడుండేవాడు కనపడక, భయపడి, పోలీస్ లకి ఫిర్యాదిచ్చింది,భర్త మడతేసేడని. ఫోటో చూసిన తరవాత, ఆ తరవాత కనుక్కుంటేనూ తెలిసిన సంగతిది, భార్య చెయ్యి పెద్దదని,అలవాటుగా భర్తని మడతేస్తుందని. .

  భార్య నుండి తన్నులు తప్పించుకోడానికి భర్త పడిన పాట్లండి. టపా రాయాలిగాని ఇలా సరిపెట్టేసేను,ఏమనుకోకండి 🙂
  ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

 5. పుట్టి యెన్ని యేండ్లు గట్టిగా గడిచెనో
  పెరిగి ఙ్ఞాన రోచి పెద్ద దయ్యె
  నింక మీద గూడ పుంఖాను పుంఖాలు
  భాస్కరోదయములు బహుళ మగుత !

  మెచ్చుకోండి

 6. పృచ్ఛకునికి తెలియద! భళి
  తచ్చన లెన్నో చయమున తా జూచెను ! మేల్
  బచ్చన సంబంధములన్
  గిచ్చుడు లాటల, గమించె గికురంపులనూ 🙂

  జిలేబి

  మెచ్చుకోండి

 7. జైల్లో పెట్టండయ్యా !
  బుల్లెమ్మనుబొక్కబొడిచి బూట్తో తొక్కా !
  పెళ్లాము దేవతగదర !
  భళ్లన దొరగారి ముక్కు పతిగాంచె జయిల్ !

  జిలేబి

  మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s