శర్మ కాలక్షేపంకబుర్లు-గుండు-బట్టతల.

గుండు-బట్టతల.

  ”ఏంతోచటం లేదోయ్!”
”ఇంట్లో కూచుని కుండల్లో గుర్రాలు తోలకపోతే అలా మా అన్నయ్యగారింటికేసి వెళ్ళిరారాదూ”, ఉచిత సలహా చెప్పింది ఇల్లాలు.
”సరే” అని కర్ర పోటేసుకుని బయలుదేరా! అక్కడికెళ్ళేసరికి మా సుబ్బరాజు,సత్తిబాబు చాలా జోరుగా చర్చించేసుకుంటున్నారు. వాతావరణం చాలా వేడిగా ఉన్నట్టుంది. ”ఎరక్కపోయివచ్చాను,ఇరుక్కుపోయాను” అనుకుని, ”రోటిలో తలదూర్చి రోకటిపోటునకు వెరువ నేర్చునా?” అనే జాతీయం గుర్తు చేసుకుని, కూచున్నా! మా సుబ్బరాజు ”అంతా మేధావులే” అన్నాడు, చర్చ సందర్భంగా. అమ్మయ్య! సావకాశం దొరికిందనుకుని చర్చ దారిమళ్ళించా ఇలా 🙂

సుబ్బరాజూ ”మేధావులన్నావుకదా! గుండువాళ్ళు మేధావులా? బట్టతలవాళ్ళా” ప్రశ్నించా!.
”అనుమానమేంటండీ!బట్టతలవాళ్ళే మేధావులని ఎప్పుడో తేల్చేశారు” అనేశాడు ఉడుకు మీద.
మా సత్తిబాబందుకుని ”బట్టతలవాళ్ళు మేధావులమని ప్రకటించుకుంటే సరిపోద్దా! శాస్త్రీయమైన అధారాలుండద్దూ” అనేశాడు.
”బట్టతలవాళ్ళకి చమురు ఖర్చులేదు, క్షవరం ఖర్చులేదు. ఖర్చులు తగ్గించుకున్నవాళ్ళు మేధావులుకాదా? గుండు వాళ్ళు పునః పునః క్షవరకళ్యాణం చేయించుకోవాలి, ఖర్చు, నూనె ఖర్చూ, అదేగాక మాకో పేరుంది తెలుసా? ఖర్వాటుడు అంటారు సంస్కృతంలో, బట్టతల మేధావిత్వానికి సూచన” అనేశాడు సుబ్బరాజు.

”నీకిలా చెబితే కుదరదుగాని, చెబుతా విను. జనాభాలో సగం మంది ఆడాళ్ళు, వాళ్ళకి బట్టతలొచ్చిన సావకాశం చూడలేదు. ఇంటికెళ్ళి మీ ఆవిడ దగ్గరని చూడు ఎవరు మేధావులో తెలిసిపోతుంది. నిజంగా ఆడాళ్ళే మేధావులు. బ్రిట్నీ స్పియర్స్ తెలుసా? పొన్నకాయలాగా గుండు చేయించుకున్న అందమైన గాయని. గుండు ఎందుకు చేయించుకుందో తెలుసా? మరింత అందంగా మెరిసిపోడానికే! గుండు చేయించుకుంటే అది నున్నగా, గచ్చకాయ నునుపుతో ఎంతందంగా పచ్చహా మెరిసిపోతుందో తెలుసా? బట్టతల చింతపండేసి ఎర్రగా తోమిన, తిరగేసిన ఇత్తడి బూరెల మూకుడులా ఉంటుంది. ఒకమాటయ్యా! మొక్క పెరగాలంటే భూమిలో సత్తువుండాలి కదా? బుర్రలో ఆ సత్తువ లేకేగదా నెత్తిమీద జుట్టూడిపోయింది, బుర్రలో గుంజుంటే పరకలు రాలిపోయి ఉండవు,మళ్ళీ మొలవకుండా! మరిమాకో పునః పునః నెత్తిమీద పరకలొస్తూనే ఉంటాయి, పునః పునః క్షవర కళ్యాణం చేయించుకుంటూనే ఉంటాం, బుర్రలో గుంజుందిగనకే పునః పునః వెంట్రుకలు మొలుచుకొస్తాయి. మా వల్ల ఒక వృత్తి బతుకుతోంది కదయ్యా! ఇప్పుడు చెప్పు ఎవరు మేధావులో అంటూ లేచిపోయాడు మా సత్తిబాబు.

ఇంతకీ మా సత్తిబాబు మాటే నిజమంటారా?

ప్రకటనలు

13 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-గుండు-బట్టతల.

 1. మీ సత్తిబాబు చెప్పినదాంట్లో అతిశయోక్తి యెంతమాత్రమున్నూ లేదు ☝️తెలివైన వాడు కదా. 🙂

  గుండు సుందరి బాగుంది, కానీ అన్ని సొట్టలేమిటో? వాళ్ళాయన గుండు కదా సొట్టలు తేలవలసింది? 🤔

  మెచ్చుకోండి

  • విన్నకోట నరసింహారావుగారు,

   మా సత్తిబాబు జుట్టున్న మేధావండి 🙂 తెలివైనవాడని సరిపెట్టేస్తే ఎలాగండి ?

   ఈ గుండు సుందరి పేరు బ్రిట్నీ స్పియర్స్, సంచలనమే ఈ సుందరి ఊపిరి. చాలా చిన్న వయసులోనే కచేరీలు చేసి పెద్దపేరు తెచ్చుకుందీ. బ్రిటన్ ప్రజలు వేలం వెర్రిగా వెంట పడ్డారు. ఇలా గుండు చేయించుకుని సంచలనం చేసింది, మరో సంచలనం, పెళ్ళికాకుండానే చాలా చిన్నవయసులో మగపిల్లవాణ్ణి కన్నది. ఇప్పటి సంగతి తెలియదండి! ఏమైతేనేం ఇప్పుడీవిడ విలువ 184 మిలియన్ పౌండ్లట 🙂

   నాతో చెప్పించారుగాని మీకు తెలియనివా? 🙂

   ధన్యవాదాలు.

   మెచ్చుకోండి

 2. క్రీడాభిరామ ‘టిట్టిభ’
  చూడామణి ‘గుండు’ గూర్చి గొప్పగ జెప్పెన్ ,
  చూడుడు ‘సీసము’ , రసమయ
  ‘బోడు’ల రమణీయతలను పూర్తిగ విప్పెన్ .

  మెచ్చుకోండి

  • YVR’s అం’తరంగం’ గారు,

   ఈ టపాకో చరిత్రుందండి. ఆంధ్ర తెలంగాణా మాటల యుద్ధం జరుగుతున్నరోజుల్లో మొదలెట్టి సగం రాసి పడేసేను. వెయ్యబుద్ధికాలేదు 🙂 ఆ తరవాత కాలం లో ఈ టపా కనపడలేదు. మరచీపోయాను. కొద్దికాలం కితం ”గుండు జిలేబీ” చూసి నవ్వొచ్చింది. ఆ ఊపుమీద టపా రాసేస్తే, తరవాత చూస్తే బ్రిట్నీ టపాలో ఉరికి ఉంది. బ్రిట్నీ గుండు చేయించుకున్న సంగతి గుర్తుండిపోయిందనమాట. 🙂 ఏం చెయ్యాలి,తీసెయ్యలేక ఫోటో కోసం గూగులమ్మనడిగితే అన్నీ జుట్టున్నఫోటోలే ఇచ్చింది. ఇవికాదు బామ్మా 🙂 గుండుతో బ్రిట్నీ తీయించుకున్నఫోటో అని అడిగితే ఇదిగో ఇదిచ్చింది, ముద్దుగా ఉంది టపాకి సరిపోయిందని పెట్టేసేనండి. ఇదండి జరిగిన సంగతి 🙂

   ధన్యవాదాలు.

   మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s