శర్మ కాలక్షేపంకబుర్లు-డొక్క చించి డోలు కట్టిస్తా!

డొక్క చించి డోలు కట్టిస్తా!

   తెనుగునాట ఈ మాట చాలా విరివిగా వాడతారు, బెదిరించడానికి. డొక్క చీల్చడమేంటో? డోలు కట్టించడమేంటో? తెలుసా?

డొక్క అంటే కడుపు అని అర్ధం. కడుపంటే నానార్ధాలున్నాయి కాని ఇక్కడ కడుపంటే తిండి తింటే నిండేది 🙂

ఇదిగో ఈ కడుపును చింపేస్తాననడమన్నమాట, అంటే కడుపు కోసేస్తా లేదూ కడుపుమాడ్చి చంపేస్తానని అర్ధం. మరిడోలు కట్టించడం 🙂

పూర్వంరోజుల్లో శవాన్ని డోలు సన్నాయితో శ్మశానానికి తీసుకుపోయేవారు

ముసలాడింట్లో చస్తాడేమోనని చల్లో వీధిలో పారేసే కొడుకులు కోడళ్ళున్నకాలం,అద్దెఇస్తున్న ఇంట్లో చస్తే తీసుకెళ్ళేలోగా కూడా ఇంట్లో ఉంచకూడదంటున్న ఓనర్ల కాలం,ఇక నలుగురు మోసుకెళ్ళేందుకెక్కడ దొరుకుతారు? ధర్మాత్ములు తోపుడు బళ్ళు,తొట్టి రిక్షాలు, వేన్లు శవాలని మోసుకు పోయేందుకు ఉచుతంగా ఏర్పాటు చేస్తున్నకాలంలో, తప్పనివారెవరో దగ్గరూంటే తప్పక శవంతో వెళుతున్నకాలం

పాతరోజుల్లో ఆరోజు చనిపోతే ఆ రోజే అంత్యక్రియలు చేసేవారు. దానికీ అబ్బో! చనిపోయినవారి పట్ల ఎంత గౌరవం చూపేవారో! డోలూ సన్నాయి పెట్టేవారు,శ్మశానం దాకా. శవంతో పాటు ఊళ్ళో అందరూ వెళ్ళేవారు. కలిగినావారైతే బుక్కా గుండ, పువ్వులు, రూపాయలు చల్లుతూ శవాన్ని మోసుకుపోయేవారు. ఇంత వైభవంగా పీనుగును తీసుకెళ్ళే సంస్కృతి. అలా మేళతాళాలు పెట్టడమే డోలు కట్టించడం.

ఇప్పుడంటే చచ్చినవాళ్ళని మూడురోజులుపాటు ఐన్ బాక్సుల్లో పెట్టి ఉంచుతున్నారు, కొడుకులూ,కూతుళ్ళూ అమెరికాలోనో ఆస్ట్రేలియాలోనో ఉంటున్నారుగా, వాళ్ళొచ్చేకా తీసుకుపోతున్నారు. తక్కువలో తక్కువ మూడు రోజులు. కొన్ని చోట్ల వాళ్ళు మేం వచ్చిమాత్రం వచ్చి చేసేదేముంది అదేదో మీరే కానిచ్చేద్దురూ మొత్తం ఎంతవుతుందో చెప్పండి,డాలర్లు పంపుతా అంటున్నారు. కార్యక్రమం ఘనంగా చేయించండి, ఒక వీడియో తీసి పంపమనీ అంటున్నారు.

అంటే చివారాఖరిమాట డొక్కచింపి డోలు కట్టిస్తా అంటే చంపి శ్మశానానికి సగౌరవంగా పంపుతానని, అదండి సంగతి.

11 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-డొక్క చించి డోలు కట్టిస్తా!

  1. మిత్రులు శర్మగారికి,
    బధిరశంఖారావాలు దేనికండీ? మీకు అసమంజసంగా అనిపించిన వ్యాఖ్యలను మీరు ప్రచురించ నక్కర లేదు కదా.

    మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

  2. Zilebiగారు,
    అర్ధం కాలేదు..
    ఇతరుల గురించి వ్యక్తిగతంగా నా బ్లాగులో మాటాడవద్దు. నా గురించి ఇతరుల బ్లాగులో మాటాడవద్దు.
    ధన్యవాదాలు.

    మెచ్చుకోండి

  3. విన్నకోట నరసింహారావుగారు,

    లైవ్ ఐతే ఇక్కడ ఏ మధ్యాహ్నమో జరిగిస్తే, అది అక్కడ ఏ అర్ధరాత్రో ఐతే, నిద్ర మేలుకోవడం కష్టం కదండీ ………………
    ధన్యవాదాలు.

    మెచ్చుకోండి

  4. శ్రీనివాస్ జీ,

    ముప్పు అంటే వృద్ధాప్యం,విపత్తు అని అర్ధాలున్నాయి, ఇక తిప్పలు అంటే కష్టాలని అర్ధం. ముప్పు తిప్పలంటే, విపత్కరమైన కష్టాలు. చావుకంటే కష్టం,గోచీ కంటే దరిద్రం లేదని నానుడి. , ఇక మూడు చెరువులనీళ్ళు తాగించడం. మూడు చెరువులనీళ్ళు ఒకసారి, పూర్తిగా తాగిస్తానని కాదు. పాత రోజుల్లో మంచినీటికి చెరువే ఆధారం,పల్లెలలో. ఒక ఊళ్ళో ఒక చెరువు ఆ చెరువునీళ్ళే తాగాలి. అమిత మైన కష్టాలు కలగజేసి ఒక ఊరునుంచి మరో,మరో,మరో ఊరికి తరిముతానని ఆ ఊళ్ళో చెరువునీళ్ళు తగిస్తాననీ అర్ధం. ఒక రోజే మూడు ఊళ్ళలో ఉండేలా చేస్తాననడం, భయంతో పరుగుపెట్టించడం ప్రాణాలకోసం, నాటి రోజుల్లో కాని నేటిఓజుల్లో కాని మూడూళ్ళుకి రోజూ తిరిగడం కష్టం కదండీ. . అంటే ఉన్న చోట తిననివ్వను,తిన్నచోట పడుకోనివ్వను,పడుకున్నచోట నిద్రపోనివ్వనని చెప్పడమేనండి. దీని డొక్క చిండానికీ ఉన్న తేడా ఏమంటే అందులో చంపేస్తానని చెప్పడం జరిగింది, ఇందులో చంపుతానని చెప్పడం లేదుగాని చచ్చిపోతే మేలు ఈ కష్టాలు పడే కంటే అనిపించేలా హింసించడమండి. దీనిని నేటి కాలం వారు శాడిజం అంటారనుకుంటాను. అమ్మయ్య చెప్పేశానండీ 🙂

    ధన్యవాదాలు.

    మెచ్చుకోండి

  5. డొక్క చీల్చి కడత డోలు జిలేబియా !
    బక్క చిక్క గాను పట్టు బోవ !
    చక్క గయిసు బాక్సు చాలని యెడమేన ?
    లక్కు పేటి గాదె లబ్జు గాన !

    చీర్స్
    జిలేబి

    మెచ్చుకోండి

వ్యాఖ్యలను మూసివేసారు.